Tuesday, April 09, 2019

ఒకరిని మించి ఒకరు .... మరి వీరిలో ఎవరు?

                  ఆంధ్రప్రదేష్ ఓటరు ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నారు అనడంలో ఏ విధమైన సందేహం లేదు,  ఇది ఒక సంక్లిష్టమైన ఎలక్షను, ఉన్న మూడు పార్టీలలో ఎవరిని నమ్మాలో తెలియని సంధిగ్దత, ఒకరిని మించి ఒకరు ప్రజలను మోసం చేయడానికి కంకణం కట్టుకున్నట్లు తమ తమ ఎలక్షను దృష్టి పత్రం లో నగదు బదిలీ, ఉత్తుత్తి తాయిలాలు ఇష్టం వచ్చిన రీతిలొ చొప్పించడాన్ని బట్టి అర్ధం అవుతుంది, డబ్బు ఆశ చూపించి ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకుని గెలుపే ద్యేయంగా ప్రజలను మోసగించడానికి సర్వం సిద్దం చేశారు, ఓటరు మోసపోవాడానికి సన్నిద్దుడై ఉన్నాడు అనుకుంటున్న ఈ రాజకీయ నాయకులకు తగిన విధం గా ఎలా బుద్ది చెప్పాలో ఆంధ్రా ఓటరుకు బాగా తెలుసు అని నేను అనుకుంటున్నాను....  

ఉన్న ముగ్గురూ ఏదో ఒక రకంగా ఇచ్చిన మాట తప్పినప్పుడు ఎవరిని నమ్మాలి? 
మనకు కావల్సింది మనలను నడిపించే నాయకుడు 
ఉన్న ముగ్గురిలో అలాంటి నాయకత్వ లక్షణాలు ఎవరికీ లేవన్నది ప్రస్పుటంగా తెలుస్తుంది , 
ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా ఏవిధమైన సంస్కరణలు ప్రజలకు ఉపయోగదాయకంగా ఉంటాయో ఆలోచించి తదననుగునంగా వ్యవసాయం, విధ్య, ఆరోగ్యం, ఆర్ధికంగా ఎలా అభివృద్ది సాధించగలమో అలాంటి సంస్కరణలు మేనిఫెస్టో లో చూడాలనుకుంటాం కానీ అన్నీ ఫ్రీ గా ఇస్తాం , డబ్బులు మీ అకౌంట్ లో వేసేస్తాం అనే వ్యక్తి నాయకుడెలా అవుతాడు?

ఈ ఎలక్షను తరువాత ఎవరు గెలిచినా సామాన్యుడు పని చేయాల్సిన అవసరం లేదు అనిపించడం నిజం, ఎందుకంటే అన్నీ ఫ్రీగా ఇస్తామంటున్నారుకదా ఇక పని చేయాల్సిన అవసరం ఏముంటుంది .. 

45 సంవత్సరాల లోపు వాల్లకు నిరుధ్యోగ బృతి  
45 సంవత్సరాలు దాటిన వాల్లకు వృద్దాప్య పించను

ఆకలేస్తే క్యాంటిను 
ఉండడానికి ఇల్లు 
పండగలకు ప్రత్యేక ప్యకేజీలు 
రూపాయికే కిలో బియ్యం
ఆడపడుచులకు పసుపు కుంకుమ
......
...... ఇలా అన్నీ ఫ్రీ 

సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా? 
మనిషికి నేను పని చెయ్యాలి అన్న ఆలోచన వచ్చేది ఆకలి వల్ల , ఆకలి తీర్చాలి కాని ఉచితంగా కాదు, అది తీరే మార్గం చూపించాలి కానీ అన్నీ ఉచితంగా ఇస్తాం అంటే ఎలా?  

ఉచితంగా ఎవరికి ఇవ్వాలి? 
పని చేసుకోలేని వారికి, వృద్దులకు, అనాధలకు , అభాగ్యులకు వీరికి చేయూతనిచ్చే వ్యవస్తను ఏర్పాటు చెయ్యండి అంతే కానీ   

అందరికీ అన్నీ ఫ్రీ గా ఇస్తాం అంటే మనిషికి పని చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? అన్నీ ఫ్రీగా ఇచ్చి సోమరిపోతులను తయారు చెస్తారా? దీనివల్ల ఎవరికి లాభం? ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అది రాజకీయ నాయకులకు మాత్రమే ఉపయోగం. 

ఎంతకాలం అన్నీ ఫ్రీ గా ఇవ్వగలరు అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేసి మరి అవతల వాళ్లు ఇస్తున్నప్పుడు నేనెందుకు ఇవ్వలేను అని బొంకేవాడా? నాయకుడంటే?  

ఇలాంటి నిస్సిగ్గు గా తమ గెలుపే లక్ష్యంగా ప్రజలను ముష్టి వాల్లుగా భావించే వారిలో ఒకరిని ఎన్నుకోవాల్సిన పరిస్తివచ్చినందుకు సిగ్గుగా ఉంది 

ఒక్కసారి ఈ ముగ్గురు గురించి చూస్తే ....  

1. 

40 సంవత్సరాల రాజకీయ అనుభవం, గతంలో ముఖ్యమంత్రి గా చేసిన అనుభవగ్నుడు , ఇవి చూసి 2014 లో అప్పటి పరిస్తితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవడానికి ఇంతకన్నా అనుభవం ఉన్నవాళ్లు దొరకరు అని ప్రజలు పట్టం కట్టారు , నాలుగు సంవత్సరాలు చేసింది, చెప్పింది ఒకటైతే ఆకస్మికంగా మలుపు తీసుకుని అప్పటివరకు మాట్లాడిన దానికి పూర్తిగా  విరుద్దమైన మాటలతో ప్రజల్ను మభ్యపెట్టడం కల్లముందు కనిపిస్తుంది.

గత 25 , 30 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని అహర్నిషలు పార్టీ కోసం పనిచేసిన, చేస్తున్న  కార్యకర్తలు వేల సంఖ్యలో  ఉన్నా వారిని కాదని దొడ్డిదారిన కొడుకుని మంత్రిని చేసిన గొప్ప తండ్రి. 
   
ఏ పార్టీ ఐతే చీకటిలో రాష్ట్రాన్ని విడగొట్టింది అని ప్రజల్ను నమ్మించి, బూచి గా చూపించి 2014 ఎన్నికల్లో గెలిచాడో అదే పార్టీతో పక్కరాష్ట్రంలో పొత్తు పెట్టుకున్న గొప్ప మనీషి  

నాలుగున్నర సంవత్సరాలు ఏవిధంగానూ ప్రజల మంచి గురించి పట్టించుకోని మనిషి కేవలం  ఎలక్షన్ లో గెలుపుకోసం రాష్ట్ర ఆదాయాన్ని విదిధ పధకాల పేరుతో ప్రజలకు ధనసాయంగా మరల్చిన రాజకీయ చతురుడు  

"నేను అధికారంలోకి వస్తే..." అని భరోసా ఇచ్చేవాడు నాయకుడు, " అతను అధికారంలోకి వస్తే..." అని భయపెట్టాలని చూస్తున్న అవకాశవాది   

ఒక్కసారి ఇతను 2018 మార్చి నెల కు ముందు మాట్లాడిన మాటలు ఆ తరువాత మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా సులభంగా అర్ధం అవుతుంది ఇతని మనస్తత్వం


2. 

ఇతనిపై 31 కేసులు ఉన్నాయని వాటికి సంబందించిన వివరాలు ఎలక్షను అఫిడవిట్ లో పొందుపరచాడు అవి తేలే వరకు నిజం తెలియదు , నమ్మదగిన మనిషా? కాదా? సమాధానం లేని ప్రశ్న 
  
ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రతిపక్ష నేత అయి ఉండి అసెంబ్లీ కి వెల్లకుండా బహిస్కరించిన గొప్ప వ్యక్తి    

ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సినంతగా చెయ్యలేదు 


3.

ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ ప్రశ్నార్ధకంగా మారింది, ప్రశ్నించాల్సిన సమయంలో మౌనంగా చూస్తూ ఉండి అంతా అయిపోయాక మైకు అందుకున్న స్టార్ 

మార్పు కోసం అని చెప్పి పక్కన పార్టిలను అనునయిస్తున్న పార్టీ  ముగ్గురూ ముగ్గురే , ఎందులోనూ తీసిపోని ఘనులు 

పార్టీలు ఓటు కోసం డబ్బు విపరీతంగా ఖర్చుపెడుతుందన్నది నిజం , ఓటుకోసం డబ్బు ఖర్చు చేసిన మనిషి గెలిచాక తనుపెట్టిన ఖర్చు కు రెట్టింపు సంపాదించడానికి ప్రయత్నిస్తాడే కానీ ప్రజల బతుకులు గురించి ఆలోచించరు అన్నది నిజం.  

చదువు విజ్ఞత నేర్పాలి , నిజాన్ని మరియూ అబద్దాన్నీ రెండుగా చూడగలగాలి, అవసరమైనప్పుడు ఎదురు తిరగ గలగాలి మన కులం అనో మతం అనో గుడ్డిగా పార్టీని పార్టీ నాయకుడిని వెనుకేసుకొస్తున్న చదువుకున్న నిరక్షరాస్యులకు నాదో విన్నపం , నా కులం అని కల్లుమూసుకుని గుడ్డిగా అనుసరించడం మాని కొంచెం సేపు కులం మతం పక్కన పెట్టి నిజా నిజాలు ఆలోచించండి,  విజ్ఞతతో సరైన నిర్ణయం తీసుకోండి     

చివరిగా,  

ఓటు పవిత్రమైనది , తప్పకుండా మీ ఓటు వినియోగించుకునే ముందు , 
ఎవరి నిబద్దత ఎంతో ఆలోచించండి,  ఉన్నవాల్లలో ఎవరో ఒకరిని నమ్మాలన్న దుస్తితిలో మీ పవిత్రమైన ఓటు ఉన్నవాల్లలో కొంచమైనా పని చెస్తాడేమో అనుకునే వారికి ఓటు వెయ్యండి, ఓటు వేసే ముందు దయ చేసి మీ నియోజకవర్గం లో నామినేట్ అయిన వ్యక్తుల గురించి , వారు ఎలాంటి వారో చూసి ఆలోచించి ఓటు వెయ్యగలరని మనవి.   

  

3 comments:

priya k said...

This post is worth everyone’s attention. Good work.Vastu consultant in Pune

sam said...

Very interesting, Good job and thanks for sharing such a good blog.
Telangana Districts News
Andhra Pradesh Districts News
Epaper Suryaa

rudraveni said...

Hi, Nice information and please keep posting, for latest Tollywood Updates hope you follow my Blog
Tollywood Gossips in Telugu