Tuesday, March 26, 2019

దృతరాష్ట్ర మంత్రాంగం - 4


రాజకీయ ప్రయోజనాల కోసం, ఒక మనిషి రెండు నాలుకల తో ఎలా  మాట్లాడవచ్చో ఋజువు చేయడం కోసం  ఇప్పుడు ఆంధ్రప్రదేష్ ఎన్నికల్లో ఉన్న అన్నీ పార్టీలూ ఒక దానికి ఒకటి పోటీ పడుతుంటే , అధికారంలో ఉన్నందున తెలుగుదేశం నాయకుడు కొంచం ఎక్కువ మోతాదులో రెండు నాలుకల ప్రసంగాలతో ప్రజల్లోకి వెల్తున్నారు.
 
ఇక్కడ నాకు గాని నా లాంటి సామాన్య ఓటరుకు గాని అర్ధం కాని విషయం ఏమిటంటే అసలు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షను ఆంధ్రా లోనా లేదా తెలంగాణాలోనా? ప్రజలు నిజంగా అయోమయ స్తితిలో ఉన్నారు, 

మైకు పుచ్చుకుని మాట్లాడే ఐదు నిముషల్లో మూడు నిముషాలకు పైన కే సీ ఆర్ ... కే సీ ఆర్ అంటుంటే సామాన్య ఓటరు బహుశా కే సీ ఆర్ కూడ ఆంధ్రాలో పోటీ లో ఉన్నారేమో అని భ్రమ పడుతున్నారు...

తెలుగుదేశం నాయకుడి ఎన్నికల ప్రసంగాలు వింటున్న..చూస్తున్న వారందరికి కలుగుతున్న సందేహం ఒక్కటే  
ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? 
ఆంధ్ర రాష్ట్రం లోనా?   
లేదా
తెలంగాణ రాష్ట్రం లోనా?
ఇప్పుడు తెలుగుదేశం ప్రత్యర్ధి టీ ఆర్ యస్ పార్టీనా లేక వై యస్ అర్ సీ పీ మరియూ జనసేన పార్టినా? 
అర్ధం కాక జుట్టు పీక్కునే పరిస్తితి స్వయాన తెలుగుదేశం పార్టి అధినేతే కలిగించడం శోచనీయం  
 
బహుశా ఇది కూడా ఒక స్ట్రాటజీ నేమో , ఓటరును అయోమయంలో పడేసి లబ్ధి పొందే ప్రయత్నమేమో? 

2014 ఎన్నికల్లో బీ జే పీ తో పొత్తు రాష్ట్ర ప్రయోజనం కోసరం మరియూ ప్రజల ప్రయోజనం కోసరం అని స్వయానా చంద్రబాబు గారు చెప్పడం నిజం...

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనం మరియూ ప్రజల ప్రయోజనాలకోసం  టీ ఆర్ యస్ తో తెలంగాణా ఎన్నికల్లో పొత్తుకోసం ప్రయత్నించాం అని చెప్పడం నిజం... 

రాష్ట్రాన్ని చీకట్లో విడదీశారని 2014 ఎన్నికల్లో కాంగ్రెసు ను దుమ్మెత్తిపోసిన తెలుగుదేశం అదే కాంగ్రెస్ తో 2018 తెలంగాణా లో పొత్తు పెట్టుకోవడం ప్రజల ప్రయోజనాలకోసమే 

మరి ఇప్పుడు ఎందుకు టీ ఆర్ యస్ ని ఇంతలా తిడుతున్నాడు అంటే అదికూడా  రాష్ట్ర ప్రయోజనం మరియూ ప్రజల ప్రయోజనాలకోసం మాత్రమే .... అంటారు అధినేత గారు 

ప్రజల్ను రెచ్చగొట్టి ప్రాంతీయ విద్వేషాలు కలించైనా ఈసారి గెలవాలన్నదేనా మీ అజెండా  ?

"కే సీ ఆర్  మనమీద పెత్తనం చేద్దామని చూస్తుంటే ఊరుకుందామా? " అన్నది చంద్రబాబు గారి సూటి ప్రశ్న , ఓ పెద్దమనిషీ  ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, 2018 తెలంగాణా ఎన్నికల్లో నువ్వు వెళ్లి తెలంగాణాలో పెత్తనం చేద్దామని ప్రయత్నించావ్,  పర్యవసానం అందరూ చూశారు,  ఆయన ఎక్కడా ప్రత్యక్షంగా ఆంధ్ర పాలిటిక్స్ లో కలుగ చేసుకున్నట్లు నాకు కనిపించలేదు మరి ఎందుకు ప్రజల్ని మోసం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారో మీకు మాత్రమే తెలియాలి.

చంద్రబాబు ట్వీటు - "ఆంధ్ర ప్రజల్ని అవమానించింది చాలక కేసీఆర్ తో కలిస్తే తప్పేంటి అని బెదిరిస్తున్న ఆంధ్రప్రదేష్ ద్రోహి జగన్, అవకాశం , వితండ వాదంతో జగన్ తన బలహీనతలన్నింటినీ బహిర్గతం చేసుకుంటున్నాడు  " 

ఎవరిది వితండవాదం? ఎవరి బలహీనతలు ఎవరు బహిర్గతం చేసుకుంటున్నారు? మీరు కేసీఆర్ తో కలిసి ఎన్నికలలో పోటీ చేయడనికి ప్రయనించినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ద్రోహి అన్నారా? అనలేదు కదా ? "తెలుగు రాష్ట్రాలు రెండూ కలిసి ఉంటే మనకు కేంద్రంలో న్యామ జరుగుతుంది"  అన్న మీరే ఇప్పుడు తెలుగురాష్ట్ర ప్రజలమద్య విధ్వెగాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారే? ఏమనాలి సార్ మిమ్మల్ని?

ఇటలీ మాఫియా అని తిట్టిన అదే నోటితో సోనియాను దేవత అంటుంటే వినే మాకు విరక్తి కలగలేదు కదా ?  సార్   

మోడి లాంటి నాయకుడిని నా జన్మలో చూడలేదు అన్న అదే నోటీతో మోడీ ని తిట్టిన తిట్టూ తిట్టకుండా తిడుతున్నారే ఏంటి సార్ ఇది? 

నేను నాయకుడిని అని చెప్పుకుంటున్నారు కదా? మరి నాయకుడు ఎలా ఉండాలి సార్? " నేను అధికారంలోకి వస్తే " అని భరోసా ఇచ్చేవాడు  నాయకుడు సార్... మీ లాగా "వాడు అధికారంలోకి వస్తే"  అని భయపెట్టలి అని చూసేవాల్లని అవకాశవాది అంటారు సార్....


తెలుగుదేశం పార్టీ ఎలక్షను లో గెలవక పోతే రాష్ట్రం నాశనం అయిపోతుందని జనాన్ని నమ్మించడానికి ప్రయత్నించే బదులు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు నిజంగా ప్రజలకు మంచి చేసి ఉంటే అది చెప్పండి సార్ మీకు జనం ఓట్లు వేస్తారు.....