Tuesday, April 23, 2019

చిన్న పొరపాటా??

     బంగారు తెలంగాణా కోసం అని పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు, ఫిరాయింపుల్ని ప్రోత్షాహిస్తున్న అధికారపార్టీ నేతలు  చెబుతున్నారు గానీ, బంగారు కలలు కల్లలుగా మిగిలి పోతాయన్న భయం తో బలవన్మరణాలకు పాల్పడుతున్న విధ్యార్ధుల గోడు ఎవరికీ పట్టకపోవడం శోచనీయం  

మన మీడియా ఈ విషయాన్ని కూడా తమకు అనుకూలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో విధ్యార్ధుల ఆత్మహత్యలు అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో గాని ఇవి తెలుగు రాష్ట్రాలలో విధ్యార్ధుల ఆత్మహత్యలు కావు , కేవలం తెలంగాణ  రాష్ట్ర విధ్యాసంస్దల్లో చదువుకున్న విద్యార్ధులు తమకు జరిగిన అన్యాయాన్ని భరించలేక బలవంతంగా ప్రాణాలు విడుస్తున్నారు.    

చిన్నపొరపాటు అని ఇంత తేలిగ్గా తీసేస్తున్న అధికారులని ఏమనాలో అర్ధంకాని పరిస్తితి, అధికారులు ఎవరినో కాపాడడానికి ప్రయంతిస్తున్నారన్న విధ్యార్ధుల ఆరోపణల్లో నిజం లేదని రుజువు చేసుకోగలరా?

అధికార యంత్రాంగం విధ్యార్ధుల ఆత్మహత్యలకు కారణమా? 
ఇంటర్మీడియేట్ బోర్డు ఆత్మహత్యలకు కారణమా? 
లేక  మానసికంగా విధ్యార్ధులను తీర్చిదిద్దడంలో (పాఠ్యాంశాలు రూపొందించడం లో) మన విధ్యా వ్యవస్ద విఫలమైందా?     

Tuesday, April 09, 2019

ఒకరిని మించి ఒకరు .... మరి వీరిలో ఎవరు?

                  ఆంధ్రప్రదేష్ ఓటరు ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నారు అనడంలో ఏ విధమైన సందేహం లేదు,  ఇది ఒక సంక్లిష్టమైన ఎలక్షను, ఉన్న మూడు పార్టీలలో ఎవరిని నమ్మాలో తెలియని సంధిగ్దత, ఒకరిని మించి ఒకరు ప్రజలను మోసం చేయడానికి కంకణం కట్టుకున్నట్లు తమ తమ ఎలక్షను దృష్టి పత్రం లో నగదు బదిలీ, ఉత్తుత్తి తాయిలాలు ఇష్టం వచ్చిన రీతిలొ చొప్పించడాన్ని బట్టి అర్ధం అవుతుంది, డబ్బు ఆశ చూపించి ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకుని గెలుపే ద్యేయంగా ప్రజలను మోసగించడానికి సర్వం సిద్దం చేశారు, ఓటరు మోసపోవాడానికి సన్నిద్దుడై ఉన్నాడు అనుకుంటున్న ఈ రాజకీయ నాయకులకు తగిన విధం గా ఎలా బుద్ది చెప్పాలో ఆంధ్రా ఓటరుకు బాగా తెలుసు అని నేను అనుకుంటున్నాను....  

ఉన్న ముగ్గురూ ఏదో ఒక రకంగా ఇచ్చిన మాట తప్పినప్పుడు ఎవరిని నమ్మాలి? 
మనకు కావల్సింది మనలను నడిపించే నాయకుడు 
ఉన్న ముగ్గురిలో అలాంటి నాయకత్వ లక్షణాలు ఎవరికీ లేవన్నది ప్రస్పుటంగా తెలుస్తుంది , 
ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా ఏవిధమైన సంస్కరణలు ప్రజలకు ఉపయోగదాయకంగా ఉంటాయో ఆలోచించి తదననుగునంగా వ్యవసాయం, విధ్య, ఆరోగ్యం, ఆర్ధికంగా ఎలా అభివృద్ది సాధించగలమో అలాంటి సంస్కరణలు మేనిఫెస్టో లో చూడాలనుకుంటాం కానీ అన్నీ ఫ్రీ గా ఇస్తాం , డబ్బులు మీ అకౌంట్ లో వేసేస్తాం అనే వ్యక్తి నాయకుడెలా అవుతాడు?

ఈ ఎలక్షను తరువాత ఎవరు గెలిచినా సామాన్యుడు పని చేయాల్సిన అవసరం లేదు అనిపించడం నిజం, ఎందుకంటే అన్నీ ఫ్రీగా ఇస్తామంటున్నారుకదా ఇక పని చేయాల్సిన అవసరం ఏముంటుంది .. 

45 సంవత్సరాల లోపు వాల్లకు నిరుధ్యోగ బృతి  
45 సంవత్సరాలు దాటిన వాల్లకు వృద్దాప్య పించను

ఆకలేస్తే క్యాంటిను 
ఉండడానికి ఇల్లు 
పండగలకు ప్రత్యేక ప్యకేజీలు 
రూపాయికే కిలో బియ్యం
ఆడపడుచులకు పసుపు కుంకుమ
......
...... ఇలా అన్నీ ఫ్రీ 

సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా? 
మనిషికి నేను పని చెయ్యాలి అన్న ఆలోచన వచ్చేది ఆకలి వల్ల , ఆకలి తీర్చాలి కాని ఉచితంగా కాదు, అది తీరే మార్గం చూపించాలి కానీ అన్నీ ఉచితంగా ఇస్తాం అంటే ఎలా?  

ఉచితంగా ఎవరికి ఇవ్వాలి? 
పని చేసుకోలేని వారికి, వృద్దులకు, అనాధలకు , అభాగ్యులకు వీరికి చేయూతనిచ్చే వ్యవస్తను ఏర్పాటు చెయ్యండి అంతే కానీ   

అందరికీ అన్నీ ఫ్రీ గా ఇస్తాం అంటే మనిషికి పని చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? అన్నీ ఫ్రీగా ఇచ్చి సోమరిపోతులను తయారు చెస్తారా? దీనివల్ల ఎవరికి లాభం? ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అది రాజకీయ నాయకులకు మాత్రమే ఉపయోగం. 

ఎంతకాలం అన్నీ ఫ్రీ గా ఇవ్వగలరు అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేసి మరి అవతల వాళ్లు ఇస్తున్నప్పుడు నేనెందుకు ఇవ్వలేను అని బొంకేవాడా? నాయకుడంటే?  

ఇలాంటి నిస్సిగ్గు గా తమ గెలుపే లక్ష్యంగా ప్రజలను ముష్టి వాల్లుగా భావించే వారిలో ఒకరిని ఎన్నుకోవాల్సిన పరిస్తివచ్చినందుకు సిగ్గుగా ఉంది 

ఒక్కసారి ఈ ముగ్గురు గురించి చూస్తే ....  

1. 

40 సంవత్సరాల రాజకీయ అనుభవం, గతంలో ముఖ్యమంత్రి గా చేసిన అనుభవగ్నుడు , ఇవి చూసి 2014 లో అప్పటి పరిస్తితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవడానికి ఇంతకన్నా అనుభవం ఉన్నవాళ్లు దొరకరు అని ప్రజలు పట్టం కట్టారు , నాలుగు సంవత్సరాలు చేసింది, చెప్పింది ఒకటైతే ఆకస్మికంగా మలుపు తీసుకుని అప్పటివరకు మాట్లాడిన దానికి పూర్తిగా  విరుద్దమైన మాటలతో ప్రజల్ను మభ్యపెట్టడం కల్లముందు కనిపిస్తుంది.

గత 25 , 30 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని అహర్నిషలు పార్టీ కోసం పనిచేసిన, చేస్తున్న  కార్యకర్తలు వేల సంఖ్యలో  ఉన్నా వారిని కాదని దొడ్డిదారిన కొడుకుని మంత్రిని చేసిన గొప్ప తండ్రి. 
   
ఏ పార్టీ ఐతే చీకటిలో రాష్ట్రాన్ని విడగొట్టింది అని ప్రజల్ను నమ్మించి, బూచి గా చూపించి 2014 ఎన్నికల్లో గెలిచాడో అదే పార్టీతో పక్కరాష్ట్రంలో పొత్తు పెట్టుకున్న గొప్ప మనీషి  

నాలుగున్నర సంవత్సరాలు ఏవిధంగానూ ప్రజల మంచి గురించి పట్టించుకోని మనిషి కేవలం  ఎలక్షన్ లో గెలుపుకోసం రాష్ట్ర ఆదాయాన్ని విదిధ పధకాల పేరుతో ప్రజలకు ధనసాయంగా మరల్చిన రాజకీయ చతురుడు  

"నేను అధికారంలోకి వస్తే..." అని భరోసా ఇచ్చేవాడు నాయకుడు, " అతను అధికారంలోకి వస్తే..." అని భయపెట్టాలని చూస్తున్న అవకాశవాది   

ఒక్కసారి ఇతను 2018 మార్చి నెల కు ముందు మాట్లాడిన మాటలు ఆ తరువాత మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా సులభంగా అర్ధం అవుతుంది ఇతని మనస్తత్వం


2. 

ఇతనిపై 31 కేసులు ఉన్నాయని వాటికి సంబందించిన వివరాలు ఎలక్షను అఫిడవిట్ లో పొందుపరచాడు అవి తేలే వరకు నిజం తెలియదు , నమ్మదగిన మనిషా? కాదా? సమాధానం లేని ప్రశ్న 
  
ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రతిపక్ష నేత అయి ఉండి అసెంబ్లీ కి వెల్లకుండా బహిస్కరించిన గొప్ప వ్యక్తి    

ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సినంతగా చెయ్యలేదు 


3.

ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ ప్రశ్నార్ధకంగా మారింది, ప్రశ్నించాల్సిన సమయంలో మౌనంగా చూస్తూ ఉండి అంతా అయిపోయాక మైకు అందుకున్న స్టార్ 

మార్పు కోసం అని చెప్పి పక్కన పార్టిలను అనునయిస్తున్న పార్టీ  



ముగ్గురూ ముగ్గురే , ఎందులోనూ తీసిపోని ఘనులు 

పార్టీలు ఓటు కోసం డబ్బు విపరీతంగా ఖర్చుపెడుతుందన్నది నిజం , ఓటుకోసం డబ్బు ఖర్చు చేసిన మనిషి గెలిచాక తనుపెట్టిన ఖర్చు కు రెట్టింపు సంపాదించడానికి ప్రయత్నిస్తాడే కానీ ప్రజల బతుకులు గురించి ఆలోచించరు అన్నది నిజం.  

చదువు విజ్ఞత నేర్పాలి , నిజాన్ని మరియూ అబద్దాన్నీ రెండుగా చూడగలగాలి, అవసరమైనప్పుడు ఎదురు తిరగ గలగాలి మన కులం అనో మతం అనో గుడ్డిగా పార్టీని పార్టీ నాయకుడిని వెనుకేసుకొస్తున్న చదువుకున్న నిరక్షరాస్యులకు నాదో విన్నపం , నా కులం అని కల్లుమూసుకుని గుడ్డిగా అనుసరించడం మాని కొంచెం సేపు కులం మతం పక్కన పెట్టి నిజా నిజాలు ఆలోచించండి,  విజ్ఞతతో సరైన నిర్ణయం తీసుకోండి     

చివరిగా,  

ఓటు పవిత్రమైనది , తప్పకుండా మీ ఓటు వినియోగించుకునే ముందు , 
ఎవరి నిబద్దత ఎంతో ఆలోచించండి,  ఉన్నవాల్లలో ఎవరో ఒకరిని నమ్మాలన్న దుస్తితిలో మీ పవిత్రమైన ఓటు ఉన్నవాల్లలో కొంచమైనా పని చెస్తాడేమో అనుకునే వారికి ఓటు వెయ్యండి, ఓటు వేసే ముందు దయ చేసి మీ నియోజకవర్గం లో నామినేట్ అయిన వ్యక్తుల గురించి , వారు ఎలాంటి వారో చూసి ఆలోచించి ఓటు వెయ్యగలరని మనవి.   

  

Saturday, April 06, 2019

ఏప్రిల్ 2 సాయంత్రానినికి ఆంధ్రప్రదేష్ జీరో అకౌంట్ ... నిజమేనా?


**** పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా ****

నలభై సంవత్సరాల  అనుభవం, ఆర్ధిక క్రమశిక్షన గల నాయకుని పాలనలో ఆంధ్ర ప్రదేష్ అకౌంట్ 30 సంవత్సరాలలో మొదటిసారి జీరో 

 జీ యస్ టీ షేరు ఆంధ్ర ప్రదేష్ అకౌంట్ లో ఏప్రిల్ 2, 2019 న పడిన  24 గంటల్లోపు 
-- అన్నదాతా శుఖీభవ
-- పసుపు కుంకుమ
-- యువనేస్తం
-- వృద్దాప్య  పించను
ఈ నాలుగు పధకాల నిమిత్తం ప్రజలకు బదిలీ అయిన మొత్తము అక్షరాల పదిహేను వేల కోట్ల రూపాయలు  (15 వేల కొట్లు)
ప్రభుత్వ ఉద్యొగుల నెలసరి వేతనం  4 వేల కోట్లు, మొత్తము పందొమ్మిది వేల కోట్లు నగదు బదిలీ

వెరసి ఖజానా ఖాలీ , అవునా ? కాదా?  .....
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం  కాంట్రక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్తితి నిజమా?  కదా? 

ఏ మధ్యే అజయ్ కలాం గారు చెప్పిన విషయం -  ఆంధ్ర రాష్ట్రప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల అప్పులు - ఇది నిజమా ? కాదా?

తమ్ముల్లూ ...

రానున్న రోజులన్ని గడ్డు రోజులు ..

ఈ నగదు బదిలీలన్నీ నాటకాలు, ఎలెక్షన్ లో గెలుపుకోసం చేస్తున్న జిమ్మిక్కులు , దయచేసి వీల్ల గారడీకి పడిపోకండి

మాయ మాటలు నమ్మకండి.... నగదు బదిలీ చేస్తామంటున్న ఏ పార్టీని నమ్మకండి మన భవిష్యత్తు అప్పుల మయం చేస్తున్న ఈ రాజకీయ నాయకులకు తగిన రీతిలో బుద్ది  చెప్పండి .... 

Tuesday, March 26, 2019

దృతరాష్ట్ర మంత్రాంగం - 4


రాజకీయ ప్రయోజనాల కోసం, ఒక మనిషి రెండు నాలుకల తో ఎలా  మాట్లాడవచ్చో ఋజువు చేయడం కోసం  ఇప్పుడు ఆంధ్రప్రదేష్ ఎన్నికల్లో ఉన్న అన్నీ పార్టీలూ ఒక దానికి ఒకటి పోటీ పడుతుంటే , అధికారంలో ఉన్నందున తెలుగుదేశం నాయకుడు కొంచం ఎక్కువ మోతాదులో రెండు నాలుకల ప్రసంగాలతో ప్రజల్లోకి వెల్తున్నారు.
 
ఇక్కడ నాకు గాని నా లాంటి సామాన్య ఓటరుకు గాని అర్ధం కాని విషయం ఏమిటంటే అసలు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షను ఆంధ్రా లోనా లేదా తెలంగాణాలోనా? ప్రజలు నిజంగా అయోమయ స్తితిలో ఉన్నారు, 

మైకు పుచ్చుకుని మాట్లాడే ఐదు నిముషల్లో మూడు నిముషాలకు పైన కే సీ ఆర్ ... కే సీ ఆర్ అంటుంటే సామాన్య ఓటరు బహుశా కే సీ ఆర్ కూడ ఆంధ్రాలో పోటీ లో ఉన్నారేమో అని భ్రమ పడుతున్నారు...

తెలుగుదేశం నాయకుడి ఎన్నికల ప్రసంగాలు వింటున్న..చూస్తున్న వారందరికి కలుగుతున్న సందేహం ఒక్కటే  
ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? 
ఆంధ్ర రాష్ట్రం లోనా?   
లేదా
తెలంగాణ రాష్ట్రం లోనా?
ఇప్పుడు తెలుగుదేశం ప్రత్యర్ధి టీ ఆర్ యస్ పార్టీనా లేక వై యస్ అర్ సీ పీ మరియూ జనసేన పార్టినా? 
అర్ధం కాక జుట్టు పీక్కునే పరిస్తితి స్వయాన తెలుగుదేశం పార్టి అధినేతే కలిగించడం శోచనీయం  
 
బహుశా ఇది కూడా ఒక స్ట్రాటజీ నేమో , ఓటరును అయోమయంలో పడేసి లబ్ధి పొందే ప్రయత్నమేమో? 

2014 ఎన్నికల్లో బీ జే పీ తో పొత్తు రాష్ట్ర ప్రయోజనం కోసరం మరియూ ప్రజల ప్రయోజనం కోసరం అని స్వయానా చంద్రబాబు గారు చెప్పడం నిజం...

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనం మరియూ ప్రజల ప్రయోజనాలకోసం  టీ ఆర్ యస్ తో తెలంగాణా ఎన్నికల్లో పొత్తుకోసం ప్రయత్నించాం అని చెప్పడం నిజం... 

రాష్ట్రాన్ని చీకట్లో విడదీశారని 2014 ఎన్నికల్లో కాంగ్రెసు ను దుమ్మెత్తిపోసిన తెలుగుదేశం అదే కాంగ్రెస్ తో 2018 తెలంగాణా లో పొత్తు పెట్టుకోవడం ప్రజల ప్రయోజనాలకోసమే 

మరి ఇప్పుడు ఎందుకు టీ ఆర్ యస్ ని ఇంతలా తిడుతున్నాడు అంటే అదికూడా  రాష్ట్ర ప్రయోజనం మరియూ ప్రజల ప్రయోజనాలకోసం మాత్రమే .... అంటారు అధినేత గారు 

ప్రజల్ను రెచ్చగొట్టి ప్రాంతీయ విద్వేషాలు కలించైనా ఈసారి గెలవాలన్నదేనా మీ అజెండా  ?

"కే సీ ఆర్  మనమీద పెత్తనం చేద్దామని చూస్తుంటే ఊరుకుందామా? " అన్నది చంద్రబాబు గారి సూటి ప్రశ్న , ఓ పెద్దమనిషీ  ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, 2018 తెలంగాణా ఎన్నికల్లో నువ్వు వెళ్లి తెలంగాణాలో పెత్తనం చేద్దామని ప్రయత్నించావ్,  పర్యవసానం అందరూ చూశారు,  ఆయన ఎక్కడా ప్రత్యక్షంగా ఆంధ్ర పాలిటిక్స్ లో కలుగ చేసుకున్నట్లు నాకు కనిపించలేదు మరి ఎందుకు ప్రజల్ని మోసం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారో మీకు మాత్రమే తెలియాలి.

చంద్రబాబు ట్వీటు - "ఆంధ్ర ప్రజల్ని అవమానించింది చాలక కేసీఆర్ తో కలిస్తే తప్పేంటి అని బెదిరిస్తున్న ఆంధ్రప్రదేష్ ద్రోహి జగన్, అవకాశం , వితండ వాదంతో జగన్ తన బలహీనతలన్నింటినీ బహిర్గతం చేసుకుంటున్నాడు  " 

ఎవరిది వితండవాదం? ఎవరి బలహీనతలు ఎవరు బహిర్గతం చేసుకుంటున్నారు? మీరు కేసీఆర్ తో కలిసి ఎన్నికలలో పోటీ చేయడనికి ప్రయనించినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ద్రోహి అన్నారా? అనలేదు కదా ? "తెలుగు రాష్ట్రాలు రెండూ కలిసి ఉంటే మనకు కేంద్రంలో న్యామ జరుగుతుంది"  అన్న మీరే ఇప్పుడు తెలుగురాష్ట్ర ప్రజలమద్య విధ్వెగాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారే? ఏమనాలి సార్ మిమ్మల్ని?

ఇటలీ మాఫియా అని తిట్టిన అదే నోటితో సోనియాను దేవత అంటుంటే వినే మాకు విరక్తి కలగలేదు కదా ?  సార్   

మోడి లాంటి నాయకుడిని నా జన్మలో చూడలేదు అన్న అదే నోటీతో మోడీ ని తిట్టిన తిట్టూ తిట్టకుండా తిడుతున్నారే ఏంటి సార్ ఇది? 

నేను నాయకుడిని అని చెప్పుకుంటున్నారు కదా? మరి నాయకుడు ఎలా ఉండాలి సార్? " నేను అధికారంలోకి వస్తే " అని భరోసా ఇచ్చేవాడు  నాయకుడు సార్... మీ లాగా "వాడు అధికారంలోకి వస్తే"  అని భయపెట్టలి అని చూసేవాల్లని అవకాశవాది అంటారు సార్....


తెలుగుదేశం పార్టీ ఎలక్షను లో గెలవక పోతే రాష్ట్రం నాశనం అయిపోతుందని జనాన్ని నమ్మించడానికి ప్రయత్నించే బదులు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు నిజంగా ప్రజలకు మంచి చేసి ఉంటే అది చెప్పండి సార్ మీకు జనం ఓట్లు వేస్తారు.....