Saturday, December 01, 2018

ఆపరేషన్ గరుడ మరో దృశ్యం...?


Friday, April 27, 2018

ఈ చానెల్స్ మనకు అవసరమా?


              నాకు ఏ రాజకీయ పార్టీ తో గాని, రాజకీయ నాయకులతో కాని ఏవిధమైన సంబందం లేదు, నేను ఒక సామాన్య పౌరుడిని, ఈ మధ్య టి వీ చానెల్స్ లో వస్తున్న చర్చా కార్యక్రమాలు చూసి మనసు లో బాధతో రాస్తున్నా..


             మీడియా ఉన్నది ప్రజల సమస్యల పై పోరాడడానికి అని చిన్నప్పుడు చదువుకుని నిజమే కాబోలు అనుకున్నాం, కానీ ఇప్పుడు టీ వీ చానెల్స్ లో వస్తున్న చర్చా కార్యక్రమాలు ఎవరికి ఎలా ఉపగోగపడుతాయో ఎవరైనా చెప్పగలరా? ఒకరెవరో వస్తారు  ఫలాన హీరో గారి అభిమానులు నాకు ఫోనులు చేసి బెదిరిస్తున్నారు అని గంటలు, రోజులు , వారాలు నెలలు టీ వీ పెడితే అతను అతనితో చర్చ.... ఇది సమాజానికి  ఏవిధంగా ఉపయోగపడుతుందో సదరు టి వీ చానెల్స్ వాల్లే చెప్పాలి.  నాదొక సందేహం , ఒక మనిషి ని ఎవరైనా బెదిరిస్తున్నారు వాల్ల వల్ల తనకు ప్రాణ హాని ఉందెమో అని అనుమానం ఉంటే వెల్లాల్సింది టి వీ చానెల్కా? పోలీస్ స్టేషనుకా? మరి అలా అని ఒక సామాన్యుడు టి వి చనల్ కి వచ్చి నా పక్కింటోడు నన్ను తంతా అంటున్నాడు అంటే  టి వి చానల్స్ చర్చకు అనుమతిస్తాయా? తన స్వలాభం కోసం,  ప్రజల్లో పలుకు బడి ఉన్న హీరో లేదా రాజకీయ నాయకుడి అభిమానులు ఎవరో ఏదో చేస్తున్నారని వస్తే సిగ్గులేకుండా నెలలు నెలలు చర్చలు జరిపిన టి వి చానల్స్ కి బుద్దొచ్చేలా ఎవరూ చెయ్యలేరా?

                సినిమాలో కాస్టింగ్ కౌచ్, సినిమా ఇండస్ట్రీ లో కాస్టిం కౌచ్ ఉన్నదా లేదా అనే విషయం కొంచం పక్కన పెడదాం, ఇప్పుడూ జరుగుతున్న విషయం గురించి మాట్లాడదాం, ఒకమ్మాయి ఒకతనితో కొన్నాళ్లు సహజీవనం ( ఆమె చూపించిన ఏ ఒక్క ఫోటో లోను తను బాధ పడుతున్న ఆనవాలు లేవు కాబట్టి)   చేసి తరువాత ఇద్దరికీ ఏదో గొడవలు రావడం వల్ల టీ వీ చానెల్ కి వచ్చి నన్ను వాడుకుని సినిమాలలో చాన్సు ఇవ్వలేదు అంటే ఏమి జరిగి ఉంటుందో ఆలోచించలేని స్తితిలో టీ వీ చానల్ యాజమాన్యం ఉందా?  లేదంటే అర్ధం చేసుకునే ఆలోచన చెయ్యలేదా? ఆమె టీ వీ చనెల్స్ ప్రత్యక్ష ప్రసారం లో తన గురించి తనను ఎవరు ఎలా వాడుకున్నారొ పచ్చిగా నిస్సిగ్గుగా చెప్తుంటే కనీసం కొన్ని పదాలు సెన్సార్ చెయ్యలి అన్న ఆలోచన కూడా రాని టి వి చనెల్స్ తమ పీ ఆర్ పీ రేటింగుల కోసం అదే విషయాన్ని ఎన్నిసార్లు చూపిస్తారు? అర్ధ నగ్న ప్రదర్షణ చేస్తుంటే సిగ్గులేకుండా కెమరాలు ఫోకస్ చేసి ప్రత్యక్ష ప్రసారాల్లో బ్రేకింగ్ న్యూస్ అని చూపిస్తుంటే ఇది బ్రేకింగ్ న్యూసా అని అడిగే సాహసం ఎందుకు చెయ్యలేకపోతున్నాం? ఆ అమ్మాయి చేసింది క్విడ్ ప్రో కో , తనకు జరిగింది అన్యాయం అనుకుంటే పోలీస్ స్టేషన్ కు వెల్లి సదరు వ్యక్తి మీద కేసు ఫయిల్ చెయ్యాలి గానీ టీ వీ చానెల్ లో చర్చ పెట్టి నానా బూతులు టెలెకాస్ట్ చెయ్యొచ్చా?     

                రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేష్  పరిస్తితి ఎలా ఉంది? మన రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన ఈ సయమయంలో  ప్రజలను పక్క దోవ పట్టించి రాజకీయ నాయకుల లబ్ధి కోసం చంచా రాజకీయం చేస్తున్న  ఈ పనికి మాలిన టీ వీ చానల్స్ మనకు అవసరమా? 


               యాజమాన్యం తమ  చానెల్స్  రేటింగుల కోసం ఇంతలా దిగజారి వాల్లేం ప్రసారం చేస్తున్నారో వాళ్లకే తెలియకుండా ఒకరి ని మించి ఇంకొకరు చెప్పిందే చెప్పి చూపించిందే చూపిస్తూ ఉంటే ఎవరూ మాట్లాడరేంటి? ఈ చానెల్స్ అన్నీ రాజకీయ నాయకుల కనుసన్నళ్లో పనిచేసే తొత్తులు ఎదిరించి మనుగడ  సాధించలేమని భయమా?

                 చానెల్స్ లో చూపించే విషయాలకు ఒక నిబద్దత ఉండాలి,  కార్యక్రమాలు ప్రజలకు కొంతలో కొంతన్నా ఉపయోగపడెలా ఉండాలి, ఉపయోగపడే కార్యక్రమాలు ప్రసారం చేయలేనప్పుడు కనీసం హాని చెయ్యని విధంగా ఉన్నా ఒకరకంగా పరవాలెదేమో. 


                 అందరం కొన్ని రోజులు స్వచ్చందంగా అన్నీ న్యూస్ చానెల్స్ ని బాయ్ కాట్ చేసి హాపీ గా ఫ్యామిలి ,ఫ్రెండ్స్ తో గడిపితే ఎంత బాగుంటుంది? అప్పుడు దిగిరావా ఈ చనెల్స్? దయ చేసి ఆలోచించండి ఒక్క చానెల్ కాదు ఇలాంటి అర్ధరహిత చర్చలు ప్రసారం చేస్తున్న అన్నీ చానెల్స్ బాయ్ కాట్ చేద్దాం, అదీ ఇదీ కాదంటే కొన్ని రొజులు టీ వీ సబ్యత్వం రద్దు చేసుకుందాం మనకూ నాలుగు రూపాయలు  మిగులుతాయ్ ఈ చెత్త చూసే బాదా తప్పుతుంది , ఆలోచించండి మిత్రులారా ....