Wednesday, June 10, 2015

చదరంగం - 2

జరిగిన విషయానికి ప్రజలకు అసలు సంబంధం ఏమిటి?
ఈ విషయంలో ప్రజలను పాత్రులను చెయ్యడానికి ఎందుకు  ప్రయత్నిస్తున్నారు?
ఇది ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య ఎలా అవుతుంది?

1. ఒక ముఖ్యమంత్రి ఫోను ట్యాపింగు చేయడం నేరం - ఇది నిజం ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి సంబందించిన ఎన్నో కాంఫిడెన్షియల్ విషయాలు మాట్లాడుతుంటారు అలా ట్యాపింగు చెయ్యడంవల్ల అవతలవాల్లకు తెలియకూడని రాష్ట్రానికి సంబందించిన విషయాలు తెలుస్తాయి అది రాష్ట్ర సార్వభౌమాధికారానికి ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉంది

     కానీ అవతలి వ్యక్తి ఫోను ట్యాపింగ్ చేసినా మీరు మట్లాడిన సంభాషణలు రికార్డవుతాయి, మీరు డబ్బుతో ఓటు కొనడం తప్పు దానిని పక్కదోవ పట్టించడానికి ఇది ట్యపింగ్ , అసలు ఈ వీడియో ఆడియో రికార్డింగులు ఎవరు బయటపెట్టారు? ఎవరు బయటపెదిటే ఏంటి? ఒకరు బయటపెడితె అది నిజం ఇంకోరు బయటపెడితే అదే అబద్దం అవుతుందా?

2. మీరు అసలు మాట్లాడారా లేదా? మాట్లాడకపోతే ఫోను ట్యాపింగు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?మాట్లాడారు కాబట్టే కదా మా ఫోన్లు ట్యాపింగ్ చేశారని మీరు అంటున్నారు

    మీరు తప్పు చేశారా లేదా?  మీరు తెప్పు చెయ్యకపోతే ఒకటే మాట ఇది మేము చెయ్యలేదు ఇవన్ని కల్పితాలు అని కోర్టుకు వెళ్లొచ్చు కదా?

3. అందరూ చేస్తున్నారు వాళ్లనెందుకు అడగరు అని అడ్డంగా వాదిస్తున్న నాయకులు నిజంగా మనుషులేనా ? అంటే మీరు తప్పు చేశామని ఒప్పుకుంటూనే అవతలవాళ్లని అడగమనడం నిజంగా అన్నంతినే మనిషి మాట్లాడే మాటేనా?

4. నిన్న ఒకనాయకుడు టీ వీ చానల్ లో చెప్తున్నాడు - మా ఐదుగురు యం యల్ ఏ లను వాళ్లు కొనలేదా అని , కొనడానికి , అమ్మడానికీ , అమ్ముడుపోవడానికీ ప్రజలు ఎన్నుకుంది నాయకులనా గొర్రెలనా?

5. ఐదుకోట్ల మంది ఆత్మ గౌరవానికి సంబందించిన విషయం - ఎలా అవుతుందండీ?   ప్రజలు ఓట్లేసి గెలిపించింది  వాళ్లకు ఏదో మంచి చేస్తారని రాష్ట్రాన్ని అభివృద్ది  పధంలో తీసుకెల్తారని అలా కాకుండా పక్క రాష్ట్రాల యం యల్ ఏ లను కొంటూ అడ్డంగా దొరికిపోయి ఇంకా ఈ బుకాయింపులెందుకు? మీరు చేసిన చండాలాన్ని ప్రజల మీద రుద్దేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?
     
            ఇది కేవలం మీ పార్టీ , మీ నాయకులకు సంబందించిన విషయం,  ప్రజలకు  ఏమాత్రం సంబందంలేని విషయం, ప్రజలను రెచ్చగొట్టి వాళ్లను భాగస్వామ్యులను చెయ్యాలని ప్రయత్నించకండి ,     అలా చేయడంవల్ల ఇప్పుడు నష్టపోయే దానికంటే ఎక్కువ నష్టపోతారు జాగ్రత్త,   ప్రజలు అమాయకులే కావచ్చు కానీ మీరు చేసిన ఛండాలాన్ని నెత్తిన రుద్దుకునేంత అమాకులు మాత్రం కాదు, అలా భ్రమ పడిన పార్టీ ఆంధ్రాలో పుట్టగతుల్లేకుండా పోయింది  .

     

Sunday, June 07, 2015

చదరంగం

           మొత్తానికి ఎక్కడో తప్పు జరిగింది,  అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నదే కానీ దొరికినవాళ్లు మాత్రమే దొంగలు -  కాబట్టి నిజాయితీగా ఎదుర్కొనడం నిజాయితీ పరులు చేసే ఉత్తమమైన పని.

            అధికరాన్ని ఆత్మ రక్షణ కోసం ఉపయోగించుకోవడం ఒక నిజాయతీ ఉన్న నాయకుడు చేసే పని కాదు, నిజాయితీగా పదవికి రాజీనామా చేసి తన గొప్పతనాన్ని నిరూపించుకున్నాక పదవి తిరిగి పొందితే ప్రజలు ఎంతగానో హర్షిస్తారు.

           ఈ విషయంలో రెండు రాష్ట్రాల ప్రజలు కొంచెం సంయవనం పాటించి జరిగేదంతా నిశితంగా  పరిశీలించి తమ నిర్ణయం తెలియజేయాలి, ఇది కేవలం ఒక రాజకీయ ఆట ,  ఎత్తులకు పై ఎత్తులు వెయ్యడంలో సిద్ధ హస్తులైన ఇద్దరు ప్రముఖులు ఒకరిపై మరొకరు తమ ఆదిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఆడుతున్న రాజకీయ చదరంగం ఇది కేవలం  ఇద్దరు  వ్యక్తుల లేదంటే రెండు రాజకీయ పార్టీల మధ్య వైరం మాత్రమే, దీనిని  రెండు రాష్ట్ర ప్రజల సమస్యగా మార్చాలని చూస్తున్న స్వార్ధపరుల వలలో పడవద్దని ప్రార్ధన.