Thursday, February 19, 2015

దృతరాష్ట్ర మంత్రాంగం - 3

అభివృద్ది వికేంద్రీకరణ అంటూనే రాజధాని నిర్మాణం కోసం 30 వేల ఎకరాల పై చిలుకు కావాలనీ అదీ సంవత్సరానికి మూడు పంటలిచ్చే పచ్చని పొలాలపై సౌధాలు నిర్మించాలని చట్టాలు మార్చి మరీ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం లో ఎన్నికలకోసం పెట్టుబడులు పెట్టిన వారికి మాత్రమే మంచి చెయ్యడానికి  ప్రస్తుత రాశ్ట్రప్రభుత్వం పనిచేస్తుందనడంలో సందేహం ఏమాత్రం లేదు.

ప్రజలకు కావల్సింది ప్రపంచంలోనే అతి పెద్ద రాజధాని మాత్రం కాదు నాయకులు చెప్పుకోవడానికి, ప్రజలను మభ్య పెట్టడానికి రోజుకొక వాగ్దానం చేసి వాటిని నిలబెట్టుకోలేక ప్రజల దృష్టిని రాజధాని వైపు మల్లించి కాలం గడుపుతున్నారని ఎవరైనా అంటే అది నిజం కాదని చెప్పే ధైర్యం రాష్ట్రప్రభుత్వానికి ఉందా?

ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వాలు కానీ పారిశ్రామిక వేత్తల మరియూ పార్టీ నాయకుల అవసరాలు తీర్చడనికి కాదు ప్రజలు ఒక్క క్షణం ఆలోచిస్తే ఏమవుతుందో ఆంధ్రాలో కాంగ్రెస్ , డిల్లీలో బీజేపీ కి ప్రజలిచ్చిన తీర్పు కల్లెదుట కనిపిస్తున్నా ఇంకా ప్రజలను మోసం చేసి కాలం వెల్లబుచ్చుదామనుకుంటే మీగతీ అధో గతే !!!

ఒకపక్క రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి బగాలేదు అంటూ మీరు చేస్తున్న కార్యక్రమాలు చూసేవారెవరెవరైనా మీ నిజాయితీని శంకించక తప్పదు.

ఒకవేళ రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి నిజంగా బాగాలేకపొతే - రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి బాగాలేదు కనుక ఋణమాఫీ మరియూ నేను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తీర్చడం సాధ్యం కాదు  నన్ను క్షమించండి నేను ఇచ్చిన వాగ్దానం తప్పాల్సిన పరిస్తితిలో నేనిలా మీముందుకొచ్చాను అని ఉంటే చంద్రబాబు నిజాయితీకి ప్రజలు బ్రహ్మరధం పట్టేవాల్లు.  

ఒక్కసారి రాజకీయాలు పక్కన పెట్టి నిజాయితీగా ఆలొచిద్దాం, ఎవరైనా


  • మాకు ఋణ మాఫీ కావాలని ఏ రైతు ఐనా అడిగారా?  
  • ప్రపంచంలోనే అతిగొప్ప రాజధాని కావాలని ప్రజలడిగారా?
  • మమ్మల్ని బిచ్చగాల్లను చేసి ముశ్టి వేయండి అని ఎప్పుడైన మీముందు చెయ్యి చాపారా?    


మొదటిసంతకం, రెండో సంతకం , మూడో సంతకం ...... ఎవరడిగారు చెయ్యలేని వాటికి సంతకాలు చెయ్యమని ?

ఏదీ ప్రజలడగలేదు మీ పదవులకోసం ప్రజల్ని సోమరిపోతులనుకుని ఇష్టం వచ్చిన వాగ్దానాలు  మీరే చేశారు,  పోనీ, కుదరదు అని చెప్పడానికి ఈగో అడ్డొచ్చిందని అనుకుందాం , మన ఇంట్లో ఐతే ఇలానే చెస్తామా? ఇంట్లో అర్ధిక పరిస్తితి బాగాలేకపోతే ప్యాలెసు  కట్టడానికి ప్లాన్ చేస్తామా? ఆర్ధిక పరిస్తితి గట్టేక్కించడానికి ప్రయత్నిస్తామా? మరి అలా ఇప్పుడెందుకు ప్లాన్ చెయ్యలేకపొతున్నాం మన ఇల్లు వేరు రాష్ట్రం వేరా? పరిపాలింఛే నాయకుడు ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకోవాలని ఎప్పుడూ వినలేదా , చదవలేదా? బిడ్డలను రోడ్డున పడేసి సౌదాలు ఎవరికోసం?  ఒక్కసారి అలోచించలేరా?


  • ప్రజలు తమంత తాము పనిచేసుకోవడానికి , కష్టపడి సంపాయించుకోవడానికి మీరేం చెస్తున్నారొ అది చెప్పండి
  • పెరిగిన నిత్యావసర ధరల నియంత్రన కోసం చేయబోయే కార్యక్రమాలు వివరించండి ఆచరణలో పెట్టండిచదువుకున్న నిరుద్యోగులకు మీరు చూపించే దారి వివరించండి   
  • ప్రభుత్వ పాఠశాలలు , కళాశాలల పనితీరు మెరుగు పరిచే కార్యక్రమాలేమైన ఉంటే అవి చెప్పండి 


అంతేగాని వీటన్నింటికీ రాజధాని నిర్మాణమే పరిష్కారమని చెప్తే నమ్మే అంత తెలివితక్కువ వాళ్లు కాదు ప్రజలు, మీరు దోచుకున్నారంటే మీరు దోచుకున్నారని  ఒకరినొకరు నిందించుకోవడం ఆపండి, ఎవరేం దోచుకున్నారొ , దోచుకుంటున్నారొ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.