Monday, May 05, 2014

ఓటు ... NOTA

         ఆంధ్రప్రధేశ్ రాజధాని ప్రకటిస్తాం అని చెప్పిన ఏ పెద్ద మనిషీ దానిగురించి మల్లీ ఒక్కమాట అయినా మాట్లాడినట్లు ఈ రెండునెలల్లో ఎవరైనా విన్నారా?  ఎన్నికలొచ్చాయి కాబట్టి జనాల్ని పూర్తిగా మత్తులో ముంచేసి కొత్త వేష భాషలతో ,సరికొత్త వాగ్దానాలతో కొంగొత్త పొత్తులతో మనల్ని ఇంకో ఐదుసంవత్సరాలు బానిసలుగా చెయ్యడానికి ఎత్తులు పై ఎత్తులు వేసే పనిలో రాజధాని విషయాన్ని మర్చిపోయారా?

గాంధీగారు నిజంగా బతికుంటే మన రాష్ట్రం లో జరుగుతున్న ఈ ఎన్నికలు చూసి ఇలాంటి వాల్లకోసమా నేను సత్యాగ్రహాలు చేసింది అని నిజంగా సిగ్గు పడే వారు.

   తప్పని సరిపరిస్తితిలో రాష్ట్రాన్ని విభజించాల్సొచ్చింది అని చెప్తున్న నాయకులు ఆ తప్పని సరి పరిస్తితి ఏమిటో చెప్పలేక పోవడాన్ని గమనిద్దాం .

    ఒకేరోజు రెండు మూడు పార్టీలు మారి సీటు తెచ్చుకోగలిగాడు అంటే వాడి డబ్బుచూసి సీటిచ్చారా లేదంటే నిజాయితీ చూసి సీటిచ్చారా? నిజాయతీ ఉంటే పదవులకోసం ఇలా దిగజారుతారా?  సిగ్గులేకుండా ఓటు అడగడానికి వస్తున్న ఈ ఊసరవెల్లులు చెప్పేది ఎలా నమ్మాలి? ఉదయం ఒకరిని తిట్టి సాయంత్రానికి అతని చంకన చేరిన ఈ చెత్త వెధవలకు ఓటేస్తే ఏమవుతుందో వేరే చెప్పాల్సిన పనిలేదు

మొన్నటివరకూ మేము వ్యతిరేకం , మాది రెండుకళ్లు రెండుకాల్లు సిద్దాంతం అన్న పెద్దమనుషులందరు ఇప్పుడు మావల్లే మీ 60 సంవత్సరాల కల ఫలించింది అని  అని ఒకప్రాంతంలో , మేము వద్దని చెప్పినా రాష్ట్రాన్ని విభజించారు అది మాకు నచ్చలేదు అని మోరో ప్రాంతంలో ఇలా ప్రాంతాలవారిగా అబద్దాలు గుప్పిస్తూ,    ఈ పిచ్చి ప్రజలకు ఏమీ అర్ధం కాదు వీల్లు  అర్ధం చేసుకోలేరు , మనం ఏదిచెప్పినా గుడ్డిగా నమ్మే అమాయకులు అని భావిస్తూ ఇంకా మోసం చెయ్యాలని చూస్తున్న ఈ నాయకులను తరిమి కొదదాం  ....


      ఓటు ...
   
         ఒక మానవ విలువ
         ఒక సమానత్వ సూచిక
         ఒక స్వాతంత్ర్య ఫలం
         ఒక రాజ్యాంగ హక్కు

    మన భారత రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును కాపాడుకుందాం... విఙ్ఞతతో ఓటేద్దాం, ఐదు సంవత్సరాలు తల ఎత్తుకు గర్వంగా తిరిగేలా ఒక్క ఓటుతో చెత్తను చీకొడదాం, బేలెట్ లో వాల్లెవరూ నచ్చకపోతే ధైర్యాంగా వీల్లలో ఎవరికీ నన్ను పాలించగలిగే నిజాయితీ లేదు అని    (  NOTA  )   చెప్దాం అంతేగాని నిలబడ్డనాయకులంతా వెధవలే  వెధవల్లో కొంచం మంచి వెధవని గెలిపిద్దాం అనుకుంటే మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే , చిన్నప్పుడు చదువుకున్న సుమతీ శతకం లో ని పధ్యాన్ని గుర్తు తెచ్చుకుని ఏ కుక్కా సింహాసనం ఎక్కకుండా చూద్దాం ....  


 మనం నిజాయితీగా వోటేసినప్పుడే నాయకున్ని నిలదీయగలం ... డబ్బు, మద్యం, నగలు లాంటి బిస్కెట్స్ కు ఆశపడి ఐదేల్లు కుక్కలా తోక ఊపుకునే దుస్తితికి నిన్ను నీవు తెచ్చుకోకు.