Tuesday, February 18, 2014

దృతరాష్ట్ర మంత్రాంగం !!!

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటు సాక్షిగా అసలు ప్రజాస్వామ్యం అంటేనే అర్ధాన్ని మార్చేశారు,  హిట్లర్ పరిపాలన గురించి చదువుకున్నమనం మన పిల్లలకు సోనియా (కాంగ్రేస్) పరిపాలన గురించి పాఠాలు చెప్పాలి ఎందుకంటే ఈమె హిట్లరు ను మించి పోయింది.  

 రాష్ట్రాన్ని విభజించడం తప్పో కాదో చెప్పలేను  కానీ ఇలా విభజించడం మాత్రం న్యాయంకాదు - మన రాజ్యాంగం గురించి మన పార్లమెంటు గురించి మనం గర్వపడతాం, గొప్ప గా చెప్పుకుంటున్నాం కాని ఇకనుంఛి చెప్పుకోవడానికేమీ లేదు అధికార ప్రతిపక్ష పార్టీలు ఏకమైతే ఎంత దారుణం చెయ్యోచ్చో దేశం మొత్తం చూసింది.

ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం , మనం ఎంత అమాయకులమో? మన వోటు ఎంత గొప్పదో? మన వోటును  మనం ఎలంటి మనుషులకు వేశామో ? ఇప్పటికైనా వెనక్కి తిరిగి చుసుకుందాం, ఇకపై ఇలాంటి తప్పు మళ్లి మళ్లీ జరక్కుండా చుసుకుందాం.

వంద రూపయల నోటు కోసమో లేదంటే ఒక పూట మందుకోసమో మనల్ని మనం అయిదు సంవత్సరాలు అమ్ముకుంటే మనప్రమేయం లేకుండా మన మద్య చిచ్చుపెట్టే ఇలాంటి నాయకులకే మనకు మిగులుతారు ,  వంద ఇచ్చాను కదా ఆ వందని వెయ్యి చేసి ఎల రాబట్టుకోవాలి  అని మత్రమే ఆలోచిస్తుంటారు ఇలాంటి సంఘటనలను చక్కగా క్యాష్ చేసుకుంటారు. స్వార్ధపరుల్ని,  చేతకని చవట దద్దమ్మల్ని మన ఓటుతో చట్ట సభలకు పంపితే ఏమి జరుగుతుందో మన రాష్ట్ర  ప్రజలకు    ఐమాక్స్ స్క్రీన్    మీద చూపింఛారు

ఇప్పుడు అందరూ పార్టీలు మారాలనో లెదంటే వేరే పార్టీ పెట్టాలనో చూస్తున్నారు తిరిగి వీల్లనే వోటేసి గెలిపిస్తే - మనం ఇంత చండాలం చేసినా మనల్నే ఎన్నుకున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలకు వేరే గత్యంతరం లేదని,  ఎవడికి వాడు నేనే నిజమైన నాయకున్నని విర్రవీగి మనల్ని బానిసలుగా  చేస్తారు , నెను ఇక్కడ ఒక పార్టీనో లేదంటే ఒక నాయకున్నో వెలెత్తి చూపడంలేదు ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడూ ఒక ఊసరవెల్లి - సమయానుకూలంగా వాల్ల వాల్ల వాక్ చాతుర్యంతో మనల్ని మబ్యపెట్టి , వాల్ల కుర్చీ కోసం ప్రజలకు ఏదో మంచి చెయ్యడానికి ప్రయతినిస్తున్నాం అని డ్రామాలాడారే కాని మనస్పూర్తిగా మనల్ని గెలిపించిన ప్రజలకు మేలు చేద్దాం అని ఆలోచించిన నాయకుడు ఒక్కడు కూడా లేడు , ఇప్పటిదాకా వీల్లు చేసిందల్లా వల్ల నాయకులు చెప్పినట్లు పూటకో వేషం  మార్చడం.  

పార్టీ మారినంతమాత్రాన మనిషి అతని వ్యక్తిత్వం మారదు ఒకవేళ మారినా అది కొత్తగా చేరిన పార్టీ అభీష్టానికి అనుగునంగా మారుతుందేకాని ప్రజాభీస్టానికి అనుకూలంగా కాదు  ,  ఇప్పటివరకు మనం నమ్మిన నాయకులు ఎలంటివాల్లో మనం చుస్తున్నాం  వోటు ఒక వజ్రాయుదం - మనం వేసే వోటు ఇప్పుడున్న రాజకీయ నాయకులకు దిమ్మ తిరిగేలా ఉండాలి , ఒక్క క్షణం ఆలోచిద్దాం ఈ మొత్తం ఎపిసోడ్  లో ఎవరైనా ప్రజల తరుపున ప్రజల కోసం ఏమైనా చేశారా...??

కేవలం వాల్ల ఉనికి కోసం వాల్లకు సీటిచ్చిన పార్టీకోసం ఎన్ని డ్రామాలు ఆడారో చూశాం, ఇలాంటి వల్లకు వోటేసి గెలిపించినందుకు ఇప్పుడు సిగ్గు పడదాం కానీ భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మల్లీ దొర్లకుండా చూసుకుందాం.

 ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా మళ్లీ గెలిచాడంటే అది మన చేతకాని తనానికి నిదర్శనమే ఇప్పుడే కాదు ఇంకో 50 సంవత్సరాలవరకూ ఇప్పుడు మన రాష్ట్రం లో ఇప్పుడు ఉన్న ఏఒక్క నాయకుడు గెలిచినా, ఏ ఓక్క పార్టీకి ఒక్కసీటు వచ్చినా మన రాష్ట్ర అభివృద్ది ఏమాత్రం ఉంటూందో ఇంతకుమించి ఉదాహరణ అవసరంలేదు.