Sunday, October 13, 2013

వీల్లా మన నాయకులు ??

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం లో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం , ప్రజలను వారి అభీష్టాలను పట్టించుకోకుండా,  స్వలాభం కోసమో లేక ఇంక దేనికోసమో పార్టీపెద్దలు ఎక్కడో ఢిల్లీ లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే , ఒక ప్రాంతంలో జరుగుతున్న ప్రజా నిరసనలను ఆ ప్రాంతపు నేతలు పట్టించుకోకుండా పదవులకోసం పెద్దల పంచ చేరి ,  గెలిపింఛి చట్ట సభలకు పంపిన ప్రజలను ఇంత చులకనగా చేస్తుంటే  ఎవరికైనా అనిపిస్తుంది మనం గెలిపించిన వాల్లు నిజంగా మనుసులేనా అని , మనకు ఏమాత్రం సిగ్గు అనేది ఉన్నా ఇలాంటి నాయకులకు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలి. రాజీనామా చేశాం అని మీడియా ముందు చెప్పి వెళ్లి ఆఫీసులో కూర్చుని వాళ్ల వాళ్ల పనులు చేసుకుంటూ మద్య మద్యలో అమ్మగారు పిలిచారు తగిన సమయం లో తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు అని కళ్ల బొల్లి కబుర్లు చెప్తూ పదవికోసమే పుట్టినట్లు సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తిస్తున్న మన ప్రజా ప్రతినిధులకు మనం బుద్ది చెప్పకపోతే నిజంగా చరిత్ర హీనులుగా  మిగిలిపోవాల్సొస్తుంది.


కాంగ్రెస్ పార్టీ మాది జాతీయ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయం అన్నారు కదా, మరి శాసనం చేసి  రహుల్ గాంధి వ్యతిరేకించాడని ఆ శాసనాన్ని ఉపసంహరించుకోవడం ఎవరికోసం రహుల్ రాజకీయ భవిష్యత్ కోసం కాదా? కొడుకు రాజకీయ భవిశ్యత్తు కోసం శాసనాన్ని ఉపసంహరించుకున్న అదే పార్టీ పెద్దలకు మరి ఒక ప్రాంత ప్రజల ఘోష వినిపించడంలేదా? అవునులే ప్రజల భవిశ్యత్తు ఎలాపోయినా పార్టీ పెద్దలకు నష్టం ఏముంది?


ఇక పోతే మన ప్రధాన మంత్రి - అతని అనుభవం అంత ఉండదు నావయసు ,  నాకెందుకో మన ప్రధాని కూడా రాష్ట్ర విభజన విషయంలో ప్రజలను తప్పు దోవ పట్టించడానికి చుస్తున్నాడనిపిస్తుంది అదెలా అంటే, అమెరికా నుండి వస్తూ విమానంలో ఇచ్చిన ఈంటర్వ్యూ లో రాష్ట్ర విభజనకు సంబందించిన నోట్ తయారయిందీ లేనిది ఈంకా నాకు తెలియదు ఇండియా వెల్లగానే సుషీల్ కుమార్ షిండే ని అడిగి తెలుసుకుంటా అని చెప్పారు , దీనికి రెండ్రోజుల ముందు షిండేగారు ఇంకా నోట్ రెడీ అవలేదు డ్రాఫ్ట్ ప్రిపేరవుతుంది అన్నారు ఆ తరువాత నోట్ గురించి ఎక్కడా న్యూస్ వచ్చిన  ధాకలాలు లేవు  మరి ప్రధాని రాగానె ఇరవైనాలుగ్గంటల లోపు ఆ ముందు రోజువరకు రడీ కాని నోట్ కు మంత్రిమండలి ఆమొదం కూడా వచ్చేసింది , ఇక్కడ ఎవరిని వీల్లంతా పిచ్చోల్లనుకుంటున్నారు - ఓట్లు వేసి గెలిపించిన మనల్నేకదా ?    


ఆంధ్ర ప్రధేశ్ లో ఉన్న అన్నీ పార్టిలు వాల్ల వాల్ల  మనుగడ కాపాడుకోవడం కోసం డిల్లీ పెద్దలకు లేఖలు ఇచ్చి ఇప్పుడు మొసలి కన్నీరు కార్చి ఎవరిని మోసం చేయలని ప్రయత్నిస్తున్నారో ఆ పార్టీ పెద్దలకే తెలియాలి. ప్రజలు వెర్రి వాల్లు అని అనుకుంటున్న ఈ పార్టీలకు ప్రజలే బుద్ది చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది.
No comments: