Tuesday, November 27, 2007

ఏరుదాటాక....

ఈ మధ్య మా మిత్రుడొకాయన ఇండియా వెళ్ళొచ్చాడు , వచ్చినప్పటినుండి ఇండియా గురించి మనమేది మాట్లాడినా అతను దాని గురించి నెగటివ్ గా మాట్లాడ్డం నాకు కోపమూ మరియూ భాధ కలిగించింది - ఆ భాధే నాతో ఈ టపా రాయిస్తుంది.

నిజమే మనదేశం ఇంకా పూర్తిగా అభివృద్ది చెందలేదు ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతూ ఉంది అలా అని అక్కడి ప్రతి విషయాన్ని అమెరికాతోనో ఆస్ట్రేలియాతోనో పోల్చి ఇండియాలో ఏమీలేదు అనడం ఎంతవరకు సమంజసం.

విదేశాల్లో ఉంటూ ఇండియా వెళ్ళొచ్చే చాలామంది భారతీయులు ఇండియాలో జరిగే ప్రతి చిన్నవిషయాన్నీ భూతద్దంలో చూస్తున్నారు.

ఇక మా మిత్రుని విషయానికొస్తే రెండుసంవత్సరాల క్రితం వరకూ ఆనందంగా తిరిగిన హైదరాబాదు నగరవీధులు ఇప్పుడసలు వీధుల్లానే కనిపంచడంలేదట " అసలు అవి రోడ్లేనా దుమ్మూ , ధూళి, పొగ తప్ప ఏముందక్కడ ?"అనేది ఈయనగారి ప్రశ్న - ఎవరైనా ఏమి సమాధానం చెప్పగలరు ఇతనికి బాగా ఎక్కువైంది అని మనసులో అనుకోవడం తప్ప.

ఇండియాలో ఏముంది దోమలు తప్ప అని అతనంటే నాకు కోపం రావడం లో తప్పు లేదు కదా? , మరి ఆ దోమలతోనే కదా ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా సహజీవనం సాగించాం ఏదో ఒకవిధంగా దోమలను తప్పించుకునో లేదంటే వాటిచేత కుట్టించుకునో అక్కడే బ్రతికాం కదా , రెండు సంవత్సరాలు బయట ఉండి ఇప్పుడు వెళ్ళి దోమల దెబ్బకి బతకలేక పోయాడంట అందుకే నాలుగు వారాలు ఉందామని వెళ్ళిరెండు వారాలకే తిరిగొచ్చాడట.


ఈయనగారికింకో పెద్ద కష్టమొచ్చి పడింది అదేమంటే ఇండియన్ న్యూస్ చానల్స్ లో వచ్చే ఇంగ్లీషు ఇతనికి అర్ధం కావడంలేదట....విన్నవాళ్ళకు నవ్వు , నవ్వుతో పాటు కోపం రాక ఏమవుతుంది చెప్పండి , రెండేళ్ళు అమెరికాలో ఉన్నంత మాత్రాన అక్కడి ఇంగ్లీషు అర్ధం కాకపోతే ఇంకో రెండేళ్ళుంటే బహుశా కని పెంచిన తల్లిదండ్రులను విధ్యా బుద్దులు నేర్పించిన గురువులను కూడా గుర్తుపట్టలేరేమో ఇలాంటి ప్రబుద్దులు.

(ఇలాంటి వాళ్ళు మనకు తరచూ ఎదురవుతూనే ఉంటారు ....వీళ్ళతో కొంచం జాగ్రత్త సుమా!! )

4 comments:

teresa said...

అసలు విషయం మీదినుంచి ఈ ధూలి,వాల్లూ,వీల్లూ distract చేస్తున్నాయి. సవరించగలరు.

karyampudi said...

teresa గారికి ధన్యవాధములు , మీరు సూచించిన సవరణలు గమనించగలరు.

Thank you very much.....

రాధిక said...

కొంతమందంతే.వాళ్ళకి వాళ్ళు మారాలి తప్పించి మనం మాటలతో వాళ్ళని ఒప్పించలేము.

Unknown said...

ఇలాంటివి చూస్తే నాకు డాలర్ డ్రీంస్ సినిమా గుర్తుకొస్తుంది.
వదిలెయ్యండి, వాళ్ళని బాగు చెయ్యలేం.