చందమామ రావే... జాబిల్లి రావే కొండెక్కిరావే గోగుపూలు తేవే....- జాబిలి కి వెన్నెలకీ పుట్టిన పున్నమివే....
- జాము రాతిరి జాబిలమ్మా జోలపాడనా ఇలా....
- జాబిలమ్మ నీకు అంతకొపమా......
ఇలా మన తెలుగులో బోలెడు పాటలున్నాయి చందమామ...జాబిల్లి....వెన్నెల అంటూ, నాకు చందమామ అంటే ఏమిటో తెలుసు..... వెన్నెల అంటే ఏమిటో తెలుసు(తెలుసు అని నేననుకుంటున్నాను సుమా) మరి ఈ జాబిల్లి (జాబిలి) అంటే ఏంటి అనేదే నాబుర్రలో తెగ తెగతిరిగేస్తున్న పురుగు.
జాబిల్లి అంటే ఏమిటి, చందమామకీ జాబిల్లి కీ సంబందము / తేడా చెప్పగలరా?
మీలో కొందరనుకోవచ్చు దీనికోసమా ఇంత హైరానా పడిపోతున్నాడు అని కానీ తెలియని విషయం తెలుసుకోవాలనుకోవడం తప్పుకాదు కదా?
4 comments:
జాబిల్లి అన్నా, ZAbilli అన్నా చంద్రుడే!
teresa గారికి ధన్యవాదములు.
చందమామ మరియూ జాబిల్లి రెండూ ఒకటే అయినప్పుడు పాటల్లో చందమామ , జాబిల్లి అని వెంట వెంటనే (చందమామ రావే.. జాబిల్లి రావే..) ఎందుకు వాడినట్లు? అలా వాడితే వినడానికి బాగుంటుందనా, లేక వేరే ఏమైనా అర్ధం ఉందంటారా !
అవును...జాబిల్లి,చందమామ...ఒక్కటే అనుకుంటా! కాదామరి...
జాబిల్లి అంటే పున్నమి చెంద్రుడు అని అనుకుంట.
Post a Comment